
మంచిర్యాల: విషాదం.. గోదావరిలో పడి బాలుడు మృతి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కన్నెపల్లి గ్రామానికి చెందిన ముత్తే భీమయ్య కుమారుడు ముత్తే శివ వర్మ (7) గురువారం సాయంత్రం గోదావరి స్థానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతితో కన్నెపల్లి గ్రామం విషాదఛాయలు నిమురుకున్నాయి.