మంచిర్యాల పట్టణంలో రంగుల పండుగ జోరుగా సాగుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా హోలీ వేడుకలలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. యువతి యువకులు రంగులతో తడిసి ముద్దయ్యారు. ముఖ్యంగా చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. హోలీ వేడుకలలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ ఆడుతూ ఒకరికొకరు శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.