మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో బుగ్గ శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో సోమవారం సకుటుంబ సమేతంగా మంచిర్యాల జిల్లా శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ దేవాలయంలో ఉదయం శివయ్యకు రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు, ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.