హైదరాబాద్ లో మర్చి 9న నిర్వహించే 17వ అఖిలభారత పద్మశాలి మహాసభలను పద్మశాలి సోదరులు విజయవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలువేరు సదానందం సోమవారం కోరారు. మహాసభలను విజయవంతం చేయడం కోసం దండేపల్లిలోని పద్మశాలి సోదరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభలకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అఖిలభారత పద్మశాలి సంఘంనాయకులు హాజరవుతారని తెలిపారు.