
మంచిర్యాల: ఉద్యోగన్నతితో మరింత బాధ్యత
ఉద్యోగన్నతులతో మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన 51 మంది కానిస్టేబుళ్లను ఆయన బుధవారం అభినందించి ర్యాంక్ పదోన్నతి చిహ్నం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జోన్ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.