హోలీ పండుగ పురస్కరించుకొని లక్షేటిపేట పట్టణంలో పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పలు కాలనీలలో ఉదయం 7 గంటల నుండి చిన్నారులు, యువతులు, యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ పాత బస్టాండ్ ఏరియాలలో రంగుల దుకాణాల వద్ద సందడి కనిపించింది. చిన్న పెద్ద, అంతా సంబరాల్లో రంగులు చల్లుకుంటూ హోలీ పండగ సంబరాలు జరుపుకున్నారు.