
మంచిర్యాల: వడ్ల బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతన్నను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మంచిర్యాల రైతులు శనివారం మండిపడ్డారు. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి నోరు మెదపడం లేదని వెంటనే మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకు 500 బోనస్ రైతుబంధు యధావిధిగా కొనసాగించాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు.