
మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబల్లి ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్న అదేవిధంగా మోసం చేస్తుందని విమర్శించారు.