ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా మందమర్రి పట్టణానికి చెందిన నందిపాటి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, నాయకులు అబిద్, జావిద్, చరణ్, చింటూ, కవిరాజ్, తదితరులు పాల్గొన్నారు.