మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం వచ్చింది. ఆదివారం దండేపల్లి మండలం కోర్విచెల్మ గ్రామంలో నష్టం జరిగిన మక్క పంటను బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పరిశీలించి జరిగిన నష్టం పై రైతులను అడిగి తెలుసుకున్నారు.