26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాడు కసబ్‌ను పట్టుకున్న మరో మాజీ పోలీసు అధికారి స్పందించారు. "ముంబైలో భారీ స్థాయిలో దాడులకు యత్నించిన ఈ ఉగ్రవాదులను విచారించిన అనంతరం మరణ శిక్ష విధించాలి. ఇది యావత్ దేశ ప్రజల ఆకాంక్ష. అలా చేస్తేనే మన అమరుల ఆత్మలకు శాంతి కలుగుతుంది" అని పేర్కొన్నారు.