ఐపీఎల్ 2025లో డిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆర్సీబీపై గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆర్సీబీ ఇచ్చిన 164 పరుగుల లక్ష్యాన్ని DC 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.