జన్నారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రాత్రి జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారిపై టపాసులు కాలుస్తూ స్వీట్లను పంచుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, నాయకులు ఉన్నారు.