గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా వేసవిలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో తీవ్రమైన వేడి ఉక్కపోతల మూలంగా ఒంట్లోంచి నీరు సోడియం వంటి లవణాల ధారాపాతంగా బయటకి వెళ్లిపోతుంటాయి. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బకు గురవుతూ ఉంటారు. దీనికి తోడు ఒంట్లో నీరు లవణాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల రక్తం చిక్కగా మారే ప్రమాదం ఉంటుందని తెలిపారు. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.