నిరుపేదల కడుపు నింపాలని ధ్యేయంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని మంగళవారం లక్సెట్టిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పేర్కొన్నారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంచే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సన్నబియాన్ని ప్రజలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.