బహిరంగ మద్యం సేవించడం నిషేధం అంటూ పోలీస్ శాఖ వారు ఉత్తర్వులు జారీ చేసిన బేకతారు చేస్తూ రెచ్చిపోతున్నారు మద్యంప్రియులు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సల్పలవాగు ప్రాంతం మద్యం సేవించడానికి అడ్డగా మారుతున్న వైనం. రాత్రివేళ పార్టీలు చేసుకుంటూ తిరుపట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయి ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.