మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని ఓ దళిత కుటుంబంపై శనివారం కార్పొరేట్ అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి పన్ను కట్టలేదని కుటుంబాన్ని బయటకు రమ్మని, మహిళ అని కూడా చూడకుండా లోపల వుండగానే దౌర్జన్యంగా గేటుకు తాళం వేసినట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులు గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా నానా హంగామా చేసి పరువు తీశారని వాపోయారు.