ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను భారత్‌కు తీసుకువచ్చారు. రాణాను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను NIA షేర్ చేసింది. విమానం నుంచి బయటకు రాగానే.. అధికారికంగా అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రకటించింది. పటియాలా హౌస్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాణాను తిహాడ్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.