
జన్నారం: ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం మినహాయింపు
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) పరిధిలో ఫీజును మార్చి 31 లోగా చెల్లించి 25 శాతం మినహాయింపును వినియోగించుకోవాలని సోమవారం పంచాయితీ ఈవో రాహుల్ కోరారు. గ్రామ ప్రజలు తమ ఆస్తులను రెగ్యులర్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ మంచి అవకాశమన్నారు. నిర్ణీత గడువులోగా వారు ఫీజును చెల్లించి మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.