
దస్తూరాబాద్: పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ
దస్తూరాబాద్ మండలంలోని బుట్టపుర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను గురువారం మండల విద్యాధికారి టి. గంగాధర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యా బోధన చేయాలని సూచించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం బ్రహ్మాచారి, ఉపాధ్యాయులు ఉన్నారు.