ఖానాపూర్ మండల పరిధిలో అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేసిన ఇసుకను శుక్రవారం బహిరంగ వేలం వేయనున్నట్లు గురువారం తహశీల్దార్ సుజాత తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనే వారు గంట ముందుగా రూ. 5వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ. 1800 ప్రభుత్వ ధర ఉంటుందన్నారు.