అనారోగ్యానికి గురై పంచాయతీ కార్యదర్శి మృతి చెందాడు. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవళ్ల రాజు (36) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన ఖానాపూర్ మండలంలోని దాసునాయక్ తండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంతి సంతాపం వ్యక్తం చేశారు.