ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జాన్నారం మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మామిడిపల్లి ఇందయ్య, మాట్లాడుతూ 30 సంవత్సరాల మంద కృష్ణ మాదిగ పోరాటం ఫలించిందన్నారు. ఈ రిజర్వేషన్లతో మాదిగ, మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.