సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి రాజేష్ శనివారం డిమాండ్ చేశారు. ఖానాపూర్ మండలం రంగంపేట గ్రామంలో హామీల అమలు కోసం ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమ గోడప్రతులను వారు విడుదల చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టియూ జిల్లా కోశాధికారి లింగన్న, నాయకులు స్వామి, ప్రసాద్ తదితరులున్నారు.