యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా గత కొన్ని రోజులుగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల అర్జీలను సమర్పించవచ్చునని పేర్కొన్నారు.