నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శనివారం విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడం పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీకి పట్టం కట్టిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.