ప్రేమ పేరుతో యువతిని హత్య చేసిన ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని గురువారం బాధిత కుటుంబ సభ్యులు కోరారు. గతేడాది ఫిబ్రవరి 8వ తేదీన ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ప్రేమ పేరుతో యువతిని హత్య ఘటనలో నిందితుడైన జూకింది శ్రీకాంతు నిర్మల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే నిందితుడితో పాటు అతనికి సహకరించిన తన తల్లితో పాటు సోదరునికి సైతం ఉరిశిక్ష విధించినప్పుడే అలేఖ్యకు న్యాయం జరుగుతుందన్నారు.