

ఖానాపూర్: ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్రప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మాణం చేసి కేంద్రానికి పంపడం హర్షణీయమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానావత్ గోవింద్ అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని జగన్నాథ్ రావు చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లంబాడాల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు.