ఖానాపూర్: ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

73பார்த்தது
ఖానాపూర్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో బుధవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని స్థానిక ఉత్తరవాహిని గౌతమి గోదావరి నది తీరానికి భక్తులు వేకువజామున నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పట్టణంలోని శివగంగాగౌరీ ఆలయంతో పాటు అన్నపూర్ణ మహాదేవ ఆలయం, మార్కండేయ ఆలయం, శివాలయంలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி