పరీక్ష రాయడానికి వచ్చి ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రలో స్పృహ తప్పి పడిపోయింది. ఈ ఘటన శుక్రవారం కడెం ప్రభుత్వ కళాశాలలో చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాయడానికి వచ్చిన చందన ఒక్కసారిగా స్పృహ తప్పి పడి పోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ లావణ్య హుటాహుటీన ఆమెను పీహెచ్‌సీకి తరలించారు. కాగా చికిత్స అనంతరం విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్ష రాసింది.