కుంటాల గ్రామానికి చెందిన జక్కుల ముత్యం అనే రైతు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను గురువారం అడవి పందులు నాశనం చేశాయి. రైతు 4 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేయగా రెండు ఎకరాల పంటను పందులు నాశనం చేశాయని బాధితుడు వెల్లడించారు. కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.