AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లలో తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. బీటీ నాయుడు ఆస్తి రూ.5,73 కోట్లు, బీద రవిచంద్ర కుటుంబ చర, స్థిరాస్తులు కలిపి రూ.41.09 కోట్లు ఉన్నాయి. కావలి గ్రీష్మ, ఆమె భర్త శ్రీనివాస్ పేరుతో రూ.3.54 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. సోము వీర్రాజు కుటుంబ ఆస్తులు రూ.2.83 కోట్లు ఉన్నాయి.