జన్నారం మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట పేదలతో నిరసన తెలిపారు. మండలంలోని గాంధీ నగర్ లో ఉన్న సీలింగ్ భూమిలో అక్కడున్న పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.