ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జ సూచించారు. మంగళవారం జన్నారంలోని ఆర్ఆర్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.