దారుణం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

70பார்த்தது
దారుణం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ పరిధిలోని పేట్ బషీరాబాద్‌లో దారుణం జరిగింది. వెన్నెలగడ్డలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఎంబీఏ విద్యార్థిని ప్రియాంక(26) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி