కడెం మండలం చిట్యాల గ్రామ సమీపంలో శనివారం ఓ చుక్కల దుప్పిని గ్రామస్థులు కాపాడారు. దుప్పిని కుక్కలు వెంటపడి తరమగా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించి దుప్పిని బయటకు తీశారు. అనంతరం అక్కడకు వచ్చిన సిబ్బందికి దుప్పిని అప్పగించగా, వారు దానికి ప్రథమ చికిత్స అందించి అడవిలో వదిలిపెట్టారు.