భారత్‌తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సోషల్ మీడియా 'ఎక్స్' (ట్విటర్) సోమవారం డౌన్ అయింది. ఒక్కోరోజులోనే మూడు సార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం నెలకొంది. దీనిపై 'ఎక్స్' యాజమాని ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్‌పై భారీ సైబర్ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన సైబర్ దాడి వెనక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉందన్నారు. ఎలా జరిగిందో ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు.