కడెం, పెద్ద బెల్లాల్ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఇన్ ఛార్జ్ రామ్ సింగ్ తెలిపారు. 33/11 కేవీ విద్యుత్తులైన్ మరమ్మతుల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వారు శుక్రవారం తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.