మయన్మార్‌లో స్కామ్ కార్యకలాపాల్లో చిక్కుకున్న 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న వీరిని అక్కడి యంత్రాంగం కాపాడింది. ఈ క్రమంలోనే తొలుత థాయ్‌లాండ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పలువురు ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో వీరిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు.