కడెం: సీపీఆర్ చేసి హెడ్ కానిస్టేబుల్ ను కాపాడిన ఎస్ఐ

80பார்த்தது
కడెం మండలం పాండ్వపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న దస్తురాబాద్ హెడ్ కానిస్టేబుల్ గోకుల్ దాస్ బుధవారం హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కడెం ఎస్ఐకి సమాచారం అందించారు. ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకొని సీపీఆర్ చేశారు. అనంతరం పోలీస్ వాహనంలో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ తరలించారు.

தொடர்புடைய செய்தி