కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698. 325 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 265 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 900, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.