కడెం మండలంలోని కన్నాపూర్ చెరువు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. దస్తూరాబాద్ నుంచి కడెం వెళ్తున్న ఆటో చెరువు వద్ద అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలు కాగా, గోడిసెర్యాల గ్రామానికి చెందిన ఎల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని 108లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.