
ఉప్పల్ స్టేడియంలో సెల్ఫోన్ దొంగతనాలు
ఉప్పల్ స్టేడియంలో శనివారం అభిమానులు ఆనందంలో మునిగి తేలగా సెల్ ఫోన్ దొంగలు చేతివాటం చూపించారు. స్టేడియం భద్రతలో దాదాపుగా 3 వేలకు పైగా పోలీసులు పహారా కాస్తున్నా. సెల్ ఫోన్లను దొంగిలించడంతో బాధితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. 15 నుంచి 20 మంది ఫిర్యాదు చేసినట్లు ఉప్పల్ సీఐ వెల్లడించారు.