

హైదరాబాద్: సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ జేఏసీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి, బంజారా ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో రూ. 12 కోట్లకు పైగా లంబాడి బంజారా ప్రజలు మాట్లాడే గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.