ఓయూలో మహనీయుల జయంతోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలను కిక్కిరిసిన విద్యార్థుల కేరింతల మధ్య ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబాపూలే, జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ల జీవితం, వారు నడిచిన మార్గం నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ అన్నారు. ముగ్గురు సంఘ సంస్కర్తలు దేశ చరిత్రనే మార్చేశారన్నారు.