రాష్ట్రంలోని 10, 956 గ్రామాల్లో మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. 'భూ భారతి' చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు.
ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.