అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని ఈనెల 19వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రోఫెసర్ ధర్మతేజ తెలిపారు. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సమావేశం నిర్వహించారు.