
లాలాగూడ: ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాద్ లోని నియో సాఫ్ట్ వేర్ కంపెనీ పేరుతో 35 లక్షల వరకు చింతల్ కు చెందిన కాళ్ళ భార్గవ్ మోసం చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఓ బాధితుడు ఫిర్యాదు చేసాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన లాలాగూడ పోలీసులు భార్గవ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. భార్గవ్ పై గతంలో జీడిమెట్ల మాదాపూర్ కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.