బాబు జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు మంద రాజు మాదిగ అధ్యక్షతన ఆయన చిత్రపటానికి విద్యార్థి నాయకులు పూలమాలవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కి తక్షణమే భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.