ఓయూలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే, అంబేద్కర్ పుట్టిన నెలలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి SC వర్గీకరణ, కుల సర్వే, 42%బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇవే రోజు గవర్నర్ ఆమోదం, సుప్రీం తీర్పు రావడం శుభసూచకమన్నారు. రేపు సీఎం చేతులమీదుగా SC వర్గీకరణ జీవో విడుదల చేస్తామన్నారు. 5నుంచి 14 వరకు సామాజిక సాధికారత ఉత్సవాలు జరుగుతాయన్నారు.